Pakistan: పాక్‌లో అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:37 PM
పాకిస్థాన్‌లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు.
కరాచీ, జూన్ 26: పాకిస్థాన్‌లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు. మంగళవారం ఒక్క రోజే అయిదు మృతదేహాలను గుర్తించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. మృతదేహాలు తమ వారివంటూ..ఇప్పటి వరకు వారి బంధువులెవరు రాకపోవడం గమనార్హం.
Also Read: Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్
మరోవైపు వేడిగాల్పులు (హీట్ వేవ్) కారణంగా వీరంతా మరణించారనే ఓ వాదన అయితే వినిపిస్తుంది. కరాచీ నగరంలో భారీగా వడగాల్పుల వీస్తున్నాయి. దీంతో పలువురు ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో నగరంలోని వివిధ ఆసుపత్రల్లో చికిత్స కోసం చేరుతున్నారు. ఇంకోవైపు కరాచీ నగరంలో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. వాటి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య సైతం అధికంగా ఉందని స్థానిక స్వచ్ఛంద సంస్థ ఈధి పౌండేషన్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. కరాచీలో అత్యధిక మరణాలు డ్రగ్స్ వల్లే సంభవిస్తున్నాయని తెలిపారు. అదీకాక డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. అందువల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని వివరించారు.
Also Read: AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు
ఇటీవల కరాచీలో ఓ వృద్ధుడు.. తన నివాసం వద్ద బహిరంగంగా డ్రగ్స్ వాడుతున్న వారిని బెదిరించాడని.. ఆ క్రమంలో అతడిపై సదరు బృందం అత్యంత పాశవికంగా దాడి చేసిన విషయాన్ని పాక్ మీడియా సైతం వెల్లడించిందని ఈధి ఫౌండేషన్ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటువంటి ఘటనలు ప్రస్తుతం అత్యధికంగా జరుగుతన్నాయన్నారు.
Also Read: Viral Video: కవితా మజాకా? ఓ చేతిలో పిల్లోడు.. మరో చేతిలో..?
దేశంలో యువత ‘ఐస్’ లేదా ‘క్రిస్టల్ మెథాంఫేటమిన్’ అనే డ్రగ్‌ను విరివిగా వినియోగిస్తుందని తెలిపారు. డ్రగ్స్ అత్యంత ఖరీదుగా మారడంతో.. యువత చాలా తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఐస్ వైపు మొగ్గు చూపుతుందన్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉంటుందని సదరు ప్రతినిధి వివరించారు. ఈ మేరకు పాక్ మీడియా జియో న్యూస్ బుధవారం వెల్లడించింది.
Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
For More National News and Latest Telugu News click here