Share News

Sunita Williams: వచ్చే ఏడాది వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత విలియమ్స్‌!

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:14 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మర్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదికి తిరిగి వస్తారని నాసా గురువారం వెల్లడించింది.

 Sunita Williams: వచ్చే ఏడాది వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత విలియమ్స్‌!

  • ఫిబ్రవరిలో తిరిగి వచ్చే అవకాశం: నాసా

వాషింగ్టన్‌, ఆగస్టు 8: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మర్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదికి తిరిగి వస్తారని నాసా గురువారం వెల్లడించింది. అయితే, వారిని ఐఎ్‌సఎ్‌సకు తీసుకెళ్లిన బోయింగ్‌ కంపెనీ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో కాకుండా.. స్పేస్‌ఎక్స్‌ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన సునీత, బచ్‌ 8 రోజులపాటు అక్కడ ఉండి తిరిగి రావాలన్నది ముందస్తు ప్రణాళిక.


కానీ, వారు ప్రయాణించిన స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో తిరుగు ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. స్టార్‌లైనర్‌లో వ్యోమగాములను తిరిగి తీసుకురావటం సురక్షితం కాని పక్షంలో ఆ వ్యోమనౌకను ఖాళీగా వెనక్కి రప్పించే అవకాశాలు ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఐఎ్‌సఎ్‌సకు సెప్టెంబరులో వెళ్లే క్రూ డ్రాగన్‌లో ఇద్దరు వ్యోమగాములను మాత్రమే తీసుకెళ్లి, వారు ఫిబ్రవరిలో తిరిగి వచ్చేటప్పుడు సునీత, బచ్‌లను కూడా వెంట తీసుకురావాలని నాసా ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - Aug 09 , 2024 | 05:14 AM