Political Crisis: సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం.. మాజీ ప్రధానితో కలిసి
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:36 PM
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత్ పొరుగుదేశమైన నేపాల్లో(nepal) రాజకీయ సంక్షోభం(political crisis) కొనసాగుతుంది. ఈ క్రమంలో నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నేపాల్ ప్రధాని ప్రచండ(Prachanda) నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓలి నేతృత్వంలోని CPN-UML పార్టీతో పాటు, రబీ లామిచానే పార్టీ RSP, JSP, జన్మత్ పార్టీ ప్రచండ ప్రభుత్వంలో చేరనున్నాయి.
నేపాలీ ప్రధాని ప్రచండ నేపాలీ కాంగ్రెస్(nepali congress)తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త హెచ్చు తగ్గులు వచ్చినా ప్రభుత్వం పడిపోవచ్చు. ఇప్పటి వరకు, నేపాల్‌లో మావోయిస్ట్ సెంటర్, నేపాలీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. జాతీయ అసెంబ్లీ ఛైర్మన్ ప్రశ్నపై దేశంలోని రెండు ప్రధాన పార్టీల మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. ఫలితంగా ఈ కూటమిలో కొనసాగడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పీఎం ప్రచండ నేపాలీ కాంగ్రెస్(nepali congress) నుంచి విడిపోయి మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. నేపాల్లో సాధారణ ఎన్నికలను నవంబర్ 2022లో నిర్వహించారు. ఆ తర్వాత పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' డిసెంబర్ 26, 2022న ఖాట్మండు(kathmandu)లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020, 2023 జనవరిలో రెండు కమ్యూనిస్ట్ పార్టీలు విచ్ఛిన్నమైన తర్వాత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ