Alaska Airlines: రోడ్డు, ఇళ్లపై విమానం విడి భాగాలు.. పనిచేయని కాక్ పీట్ వాయిస్ రికార్డర్
ABN , Publish Date - Jan 08 , 2024 | 04:30 PM
విమానం ఆకాశంలో ఉండగానే అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1282 ఫ్లైట్ డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. విమానం కాక్ పీట్ వాయిస్ రికార్డర్‌లో డేటా ఓవర్ రైట్ అయినట్టు గుర్తించారు.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: విమానం ఆకాశంలో ఉండగానే అలస్కా ఎయిర్‌లైన్స్‌కు ( Alaska Airlines) చెందిన 1282 ఫ్లైట్ డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. ఆ సమయంలో ఒకరి మొబైల్ కూడా పడిపోయింది. ప్రమాద ఘటనపై ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు ప్రారంభించింది. విమానం కాక్ పీట్ వాయిస్ రికార్డర్‌లో డేటా ఓవర్ రైట్ అయినట్టు గుర్తించింది. సరైన సమయంలో ఆఫ్ చేయకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
విమానం గాలిలో ఉండగా పడిపోయిన భాగాలు, ప్రయాణికుల వస్తువులను పలు చోట్ల గుర్తించారు. డోర్ ప్లగ్‌ను పోర్ట్ లాండ్‌లో గల బాబ్ అనే టీచర్ పెరట్లో స్వాధీనం చేసుకున్నారు. బారెన్స్ రోడ్ వద్ద విమానం తలుపు ఊడిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. పెరడిలో విమానం భాగం పడిపోయిందని బాబ్ పోలీసులకు తెలిపారు. ఆ డోర్ బరువు 30 కిలోల వరకు ఉంది. విమానం నుంచి పడిపోయిన ఐఫోన్‌ను అధికారులు గుర్తించారు. 16 వేల అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన పనిచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
అలస్కా ఎయిర్ లైన్స్‌కు ( Alaska Airlines) చెందిన విమానం శుక్రవారం రాత్రి అమెరికాలోని (America) పోర్ట్ లాండ్ నుంచి ఒంటేరియా వెళ్లింది. 16 వేల అడుగుల ఎత్తు వెళ్లాక డోర్ (Door) ఊడింది. ఆ సమయంలో విమానంలో 174 మంది ఉన్నారు. ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.