Bangladesh: చిన్మయ్ దాస్‌కు దక్కని ఉపశమనం.. అప్పటి వరకూ జైల్లోనే
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:43 PM
బెయిలు కేసు విచారణ ఉండటంతో మంగళవారంనాడు కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ఏరియాలోని పలు ప్రాంతాల్లో అదనపు పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. కొందరు లాయర్ల ప్రదర్శన నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే, నిందితుడిని కోర్టుకు హాజరు పరచలేదని డైలీ స్టార్ పత్రిక తెలిపింది.
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ గళం విప్పి 'దోశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన ఆధ్యాత్మిక నేత చిన్మయ్ దాస్‌కు ఉపశమనం దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను బంగ్లా కోర్టు 2025 జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అంతవరకూ ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుంది. డిఫెన్స్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసు విచారణను చిట్టగ్యాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సైఫుల్ ఇస్లాం వాయిదా వేసినట్టు డైలీ స్టార్ బంగ్లాదేశ్ తెలిపింది. ఈ విషయాన్ని చిట్టగ్యాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ప్రాసిక్యూషన్) ముజఫర్ రహమాన్ సైతం ధ్రువీకరించారు.
Indian Passengers: 60 మంది భారత ప్రయాణికులకు ఇబ్బందులు.. తిండి, నీరు లేకుండా 14 గంటలకు పైగా..
బెయిలు కేసు విచారణ ఉండటంతో మంగళవారంనాడు కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ఏరియాలోని పలు ప్రాంతాల్లో అదనపు పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. కొందరు లాయర్ల ప్రదర్శన నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే, నిందితుడిని కోర్టుకు హాజరు పరచలేదని డైలీ స్టార్ పత్రిక తెలిపింది.
హిందూ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతేకు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను నవంబర్ 23న ఢాకాలో అరెస్టు చేసారు. హిందూ కమ్యూనిటీ నిర్వహించిన ఒక ర్యాలీలో బంగ్లా జాతీయజెండాను చిన్మయ్ దాస్ అవమానపరిచారంటూ స్థానిక రాజకీయ నేత ఒకరు అక్టోబర్ 31న ఫిర్యాదు చేసిన నేపథ్యలో చిన్నయ్ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బెయిలు నిరాకరిస్తూ కస్టడీలోకి తీసుకోవడంతో కోర్టు వెలుపల హిందూ భక్తులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చిన్నయ్ దాస్‌ను విడుదల చేయాలంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చిన్మయ్ కృష్ణదాస్‌కు బాసటగా నిలుస్తామంటూ 'ఇస్కాన్' సంస్థ ప్రకటించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతి ప్రార్ధనలకు పిలుపునిచ్చింది. దాస్ అరెస్టు, బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసనను బంగ్లా ప్రభుత్వానికి తెలియజేసింది. మరోవైపు, 'ఇస్కాన్'ను ర్యాడికల్ సంస్థగా పేర్కొంటూ బంగ్లాదేశ్‌లోని 'ఇస్కాన్'పై నిషేధం విధించాలని స్థానిక న్యాయవాది ఒకరు పిటిషన్ వేశారు.
ఇవి కూాడా చదవండి...
కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష
Donald Trump : డాలర్‌తో పెట్టుకుంటే.. టాటా చెప్పాల్సిందే!
Read More International News and Latest Telugu News