Pakistan: పాకిస్థాన్ భారీ టెర్రర్ ఆపరేషన్.. 23 మంది ఉగ్రవాదులు హతం.. ఏడుగురు సైనికులు మృతి
ABN , Publish Date - May 27 , 2024 | 08:01 PM
ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్‌కి అదే ఉగ్రవాదం తలనొప్పిలా మారింది. తాజాగా అక్కడి సైన్యంపై తుపాకులతో దాడులకు దిగిన ఉగ్రవాదులను పాక్ సైన్యం టెర్రర్ ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టింది. మే 26, 27 తేదీల్లో జరిగిన ఆపరేషన్‌లో.. 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్‌కి అదే ఉగ్రవాదం తలనొప్పిలా మారింది. తాజాగా అక్కడి సైన్యంపై తుపాకులతో దాడులకు దిగిన ఉగ్రవాదులను పాక్ సైన్యం టెర్రర్ ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టింది. మే 26, 27 తేదీల్లో జరిగిన ఆపరేషన్‌లో.. 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఏడుగురు సైనికులు వీర మరణం పొందారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి అనుబంధంగా ఉన్న 23 మంది ఉగ్రవాదులను మూడు వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్చి చంపింది.
సమస్యాత్మక వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంక్వాలో కాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తూ, టీటీపీకి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదుల జాడ కనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ పోరాటం జరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటనలో పేర్కొంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో మూడు వేర్వేరు ఆపరేషన్లలో భద్రతా దళాలు 23 మంది ఉగ్రవాదులను చంపాయి.
పెషావర్ సమీపంలోని హసన్ ఖేల్ ప్రాంతంలోనే ఏకంగా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘర్షణలో ఓ సైనికుడు, అధికారి మృతి చెందారు. మరో ఆపరేషన్‌లో పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదుల ప్రణాళికను భగ్నం చేసి మెరుపు దాడులు చేశాయి. ఈ ఘటనలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మూడో ఘర్షణ ఖైబర్ జిల్లాలోని బాగ్ ప్రాంతంలో జరిగింది.
ఇందులో భద్రతా దళాలు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. చనిపోయిన ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు కనిపిస్తే వారిని అంతమొందించేందుకు ఆపరేషన్లు చేపడుతున్నట్లు పాక్ సైన్యం తెలిపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్‌పైకి వారే తిరగబడటంతో దేశంలోని వందల సంఖ్యలో అమాయకపు ప్రజలు బలవుతున్నారు.
New Rules: జూన్ 1నుంచి మారబోయే నిబంధనలివే
For Latest News and International News