అఫ్గాన్‌పై పాక్ దాడులు..46 మంది మృతి
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:55 AM
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 46 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
కాబూల్, డిసెంబరు 25: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 46 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ దాడులకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మంగళవారం అర్ధరాత్రి సరిహద్దుల్లో ఉండే పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో నాలుగు గ్రామాలే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులు చేసింది. ఇందులో ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. 2021లో తాలిబన్ సర్కారు అధికారం దక్కించుకున్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి.