Petrol Price: బంపర్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ!
ABN , Publish Date - May 01 , 2024 | 07:04 PM
ధరల పెరుగులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్‌పై రూ.5, హై-స్పీడ్ డీజిల్‌పై రూ.9 చొప్పున.. ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ధరలు, దిగుమతి ప్రీమియంల తగ్గుదల కారణంగా..
ధరల పెరుగులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్‌పై రూ.5, హై-స్పీడ్ డీజిల్‌పై (HSD) రూ.9 చొప్పున.. ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ధరలు, దిగుమతి ప్రీమియంల తగ్గుదల కారణంగా.. ఇంధన ధరలు ఇలా భారీగా తగ్గినట్టు తెలిసింది. అయితే.. ఈ ధరలు తగ్గింది మన ఇండియాలో కాదు, ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాకిస్తాన్‌లో!
క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు
గత రెండో వారాల్లో.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా బ్యారెల్‌కు సుమారు $3, $5 తగ్గినట్లు సమాచారం. ఇన్‌ల్యాండ్ ఫ్రైట్ ఈక్వలైజేషన్ మార్జిన్ (IFEM) ఆధారంగా.. పెట్రోల్ ధర లీటరుకు రూ.4.50-5.20, డీజిల్ ధర లీటరుకు రూ.8-8.50 తగ్గుతుందని అంచనా వేయబడింది. పెట్రోల్ దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు 10.7 డాలర్ల నుంచి దాదాపు 10 శాతం తగ్గి 9.60 డాలర్లకు చేరుకుంది. డీజిల్ ధర కూడా బ్యారెల్‌కు సుమారు $5 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధర 98.5 డాలర్ల నుంచి 96.6 డాలర్లకు, హెచ్‌ఎస్‌డీ ధర బ్యారెల్‌కు 102.9 డాలర్ల నుంచి 97.5 డాలర్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు.
మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ
నిజానికి.. రెండు వారాల క్రితం పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని వరుసగా లీటరుకు రూ.4.53, రూ.8.14 పెంచింది. ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఈ ధరలు కొనసాగాయి. కానీ.. మే 1వ తేదీ నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇబ్బడిముబ్బడిగా ధరలు పెరిగి, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రజలకు.. ఈ తగ్గుదల కాస్త ఊరట కలిగించే విషయమే!
Read Latest International News and Telugu News