Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:57 AM
ఓ చిన్న విమానం అనుకోకుండా జనాలు ఉండే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది, వివరాలేంటనేది ఇక్కడ చూద్దాం.
పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ఓ ప్రాంతంలో ఓ చిన్న విమానం ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించగా, డజను మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన ఆదివారం బ్రెజిల్ గ్రామాడోలోని ఓ నివాస ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని అందించింది. విమానం మొదట ఓ ఇంటి చిమ్నీని ఢీకొట్టిందని, ఆ తర్వాత భవనంలోని రెండో అంతస్తును ఢీకొట్టి గ్రామాడోలోని ప్రధాన నివాస ప్రాంతంలోని మొబైల్ ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లిందని పౌర రక్షణ సంస్థ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.
డజను మందికిపైగా
ఈ ప్రమాదంలో మైదానంలో ఉన్న డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులని చెబుతున్నారు. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని ఓ నగరం నుంచి గ్రామాడో సెర్రా గౌచా పర్వతాలలో విహరిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నగరం 19వ శతాబ్దంలో పెద్ద సంఖ్యలో జర్మన్, ఇటాలియన్ వలసదారులచే స్థిరపడింది. ఇది క్రిస్మస్ సెలవులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశమని చెబుతుంటారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More International News and Latest Telugu News