PM Modi Kuwait Visit: కువైట్ 'మినీ ఇండియా'లా కనిపిస్తోంది
ABN , Publish Date - Dec 21 , 2024 | 08:53 PM
రెండ్రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన 'హలా మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని అన్నారు.
కువైట్ సిటీ: ఏటా వందలాది మంది భారతీయులు కువైట్ వస్తూ కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని ప్రవాస భారతీయులను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను నైపుణ్య రంగులతో నింపారని అన్నారు. ఇంత మంది భారతీయులను ఒకేచోట చూడం ఎంతో ఆనందంగా ఉందని, 'మినీ ఇండియా'లా కనిపిస్తోందని అన్నారు. రెండ్రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన 'హలా మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రెమిటెన్స్‌లను స్వీకరించడంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందంటే మీరంతా కష్టపడి పనిచేస్తుండటం వల్లే సాధ్యమైందని ఉన్నారు.
PM Modi Kuwait Visit: లేబర్ క్యాంపులో భారతీయ కార్మికులతో మోదీ మాటామంతీ
కువైట్-భారత్ మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయని, ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు అరేబియా సముద్రానికి రెండు వైపులా ఉన్నాయని, కేవలం దౌత్య సంబంధాలే కాకుండా హృదయం సంబంధాలు ఇరుదేశాలను దగ్గర చేస్తున్నాయని అన్నారు. భారత్‌లోని స్టార్టప్‌లు, సాంకేతక నైపుణ్యాలు కువైట్ అవసరాలకు నూతన పరిష్కారాలను చూపించగలవని అన్నారు.
కువైట్‌లో పర్యటించడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నానని, 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని ఇక్కడకు వచ్చారని అన్నారు. ఇండియా నుంచి కువైట్ రావడానికి నాలుగు గంటలే పడుతుందని, ప్రధానికి నాలుగు దశాబ్దాలు పట్టిందని చెప్పారు. రెండున్నర గంటల క్రితమే ఇక్కడకు వచ్చాయని, ఇక్కడకు అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతో ఆప్యాయతా అనురాగాలు తన చుట్టూరా ఉన్న అనుభూతి కలుగుతోందని అన్నారు. ఇక్కడున్న వారంతా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని, అందర్నీ చూస్తుంటే 'మినీ ఇండియా'లా అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump: 18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్ సర్కారు బహిష్కరణ కత్తి!
Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా
Read Latest and International News