Share News

PM Modi: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం..ఆరేళ్లలో ఇదే మొదటి పర్యటన

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:41 PM

మోదీ సింగపూర్ పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

PM Modi: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం..ఆరేళ్లలో ఇదే మొదటి పర్యటన

సింగపూర్: రెండు దేశాల పర్యటనలో భాగంగా బ్రూనే పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సింగపూర్ (Singapore) చేరుకున్నారు. చాంగీ విమానశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు. సుమారు ఆరేళ్లకు సింగపూర్‌లో మోదీ పర్యటిస్తున్నారు.


మోదీ తన పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోదీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోదీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. భారత్-సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

PM Modi: బ్రూనైలో మోదీకి క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం.. రికార్డు సృష్టించిన ప్రధాని


కాగా, ఇండియా-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామం ప్రగతిని ఉభయదేశాల నాయకులు సమీక్షిస్తారని, పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతాయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాన్యుఫాక్చరింగ్, డిజిటలైజేషన్, సస్టయినబుల్ డవలప్‌మెంట్ వంటి రంగాల్లో పరస్పరం చర్చిస్తారని పేర్కొంది. ఇరుదేశాల దౌత్యసంబంధాలకు 60వ వార్షికోత్సవం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు. 1965 నుంచి భారత్-సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 2015లో మోదీ సింగపూర్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. సింగపూర్‌లో 3.5 లక్షల మంది భారత సంతతి ప్రజలున్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక భాగస్వామిగా సింగపూర్ ఉండటంతో పాటు అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్‌లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సుమారు 9,000 ఇండియన్ కంపెనీలు సింగపూర్‌లో నమోదయ్యాయి.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Updated Date - Sep 04 , 2024 | 02:41 PM