Diplomacy: 21వ శతాబ్దం ఆసియాదే : మోదీ
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:11 AM
21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ గురువారం లావోస్ చేరుకున్నారు.
వియటియానే, అక్టోబరు 10: 21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ గురువారం లావోస్ చేరుకున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు యుద్దం, ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్, ఆసియాన్ దేశాల మఽధ్య స్నేహం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
గత దశాబ్ద కాలంలో భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం రెండితలై 130 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. ‘భారతదేశం ఒక దశాబ్దం క్రితం తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలపై ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇది భారత్, ఆసియాన్ దేశాల మఽధ్య చారిత్రాత్మక, సంబంధాలకు కొత్త శక్తిని, దిశ, నిర్దేశాలను చేకూర్చింది, అని ప్రధాని తెలిపారు.