Share News

Modi-Jinping Meet: మోదీ, జిన్‌పింగ్ చర్చలు.. ఐదేళ్లలో ఇదే మొదటిసారి

ABN , Publish Date - Oct 23 , 2024 | 07:23 PM

వాస్తవాధీన రేఖ వెంబడి 2000 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వద్ద గస్తీని పునరుద్ధరించేందుకు ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉభయనేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి.

Modi-Jinping Meet: మోదీ, జిన్‌పింగ్ చర్చలు.. ఐదేళ్లలో ఇదే మొదటిసారి

కజాన్: రష్యా (Russia)లోని కజాన్‌లో జరుగుతున్న 'బ్రిక్స్' దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో (BRICS summit) కీలక పరిణామం చోటుచేసుకుంది. సదస్సు రెండో రోజైన బుధవారంనాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), చైనా అధ్యకుడు జిన్ పింగ్ (Xi Zinping) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరుదేశాలు పరస్పరం సహకారాన్ని పెంపొదించుకునే దిశగా చర్చలు సాగించారు. వచ్చే ఏడాది చైనా ఎస్‌సీఎం ప్రెసిడెన్సీకి భారత్ పూర్తి మద్దతిస్తు్ందని మోదీ భరోసా ఇచ్చారు.

BRICS Summit: టెర్రర్ ఫండింగ్‌పై ద్వంద్వ ప్రమాణాలు.. చైనాకు మోదీ చురకలు


వాస్తవాధీన రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వద్ద గస్తీని పునరుద్ధరించేందుకు ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉభయనేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2019 అక్టోబర్‌లో వీరు సమావేశమయ్యాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడానికి కొద్ది నెలలు ముందు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు అగ్రనేతలు కలవడం ఇదే మొదటిసారి.


చైనాకు చురకలు

చైనాతో ద్వైపాక్షిక భేటీకి ముందు బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదని, ఉగ్రవాదానికి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి నిధులు సాయం అందిచడాన్ని సమష్టిగా అడ్డుకోవాలని పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందిస్తున్న చైనాపై పరోక్షంగా చురకలు వేశారు. చర్చలు, దౌత్యప్రక్రియను భారత్ ప్రోత్సహిస్తుందని, యుద్ధాన్ని ప్రోత్సహించదని పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు.


Read More International News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 07:27 PM