Share News

Modi Bilateral Meetings: మెక్రాన్, సునాక్, జెలెన్‌స్కీతో మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలతో బిజీ

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:51 PM

జీ-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల అగ్రనేతలతో శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ , యూకే ప్రధానమంత్రి రిషి సునక్‌ లతో మోదీ సమావేశమయ్యారు.

Modi Bilateral Meetings: మెక్రాన్, సునాక్, జెలెన్‌స్కీతో మోదీ భేటీ..  ద్వైపాక్షిక చర్చలతో బిజీ

అపులియా: జీ-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ (Italy) వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పలు దేశాల అగ్రనేతలతో శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ (Emmanuel Macron), యూకే ప్రధానమంత్రి రిషి సునక్‌ (Rishi Sunak)లతో మోదీ సమావేశమయ్యారు.


మెక్రాన్‌తో..

తొలుత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వివిధ గ్లోబల్ అంశాలపై ఉభయనేతలు చర్చించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. కాగా, మెక్రాన్‌తో ఏడాదిలో తాను జరిపిన నాలుగో సమావేశం ఇదని ప్రదాని మోదీ ట్వీట్ చేశారు. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతుందన్నారు. తమ మధ్య పలు అంశాలతో పాటు రక్షణ, భద్రత, టెక్నాలజీ, ఏఐ, బ్యూ ఎకానమీ వంటి అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. యువతలో ఇన్నెవేషన్, రీసెర్చ్ వర్క్‌ను ప్రోత్సహించడంపైన కూడా చర్చించామన్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు అభినందనలు సైతం తెలియజేసినట్టు చెప్పారు.


రిషి సునాక్‌తో..

కాగా, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్‌తో సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమ్యయారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జీ-7 పర్యటనకు మోదీ వచ్చారు. రిషి సునాక్‌తో ద్వైపాక్షిక అంశాలతో పాటు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మోదీ చర్చించారు. ఇరువురూ కలుసుకోగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జి-20 సదస్సు తర్వాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి.

Giorgia Meloni: G7 గ్లోబల్ గెస్టులకు నమస్తే అంటూ స్వాగతం..వీడియో వైరల్


జెలెన్‌స్కీతో..

కాగా, జీ-7 సదస్సుకు హాజరైన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను కూడా మోదీ కలుసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా సంక్షిప్తంగా మోదీకి జెలెన్‌స్కీ వివరించినట్టు తెలుస్తోంది. చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇండియా బాసటగా ఉంటుందని, ఆ వైఖరిని తాము కొనసాగిస్తామని జెలెన్‌స్కీకి మోదీ భరోసా ఇచ్చారు.

Updated Date - Jun 14 , 2024 | 05:51 PM