Share News

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:01 AM

mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..
Cancer Vaccine

ప్రాణాంతర వ్యాధుల్లో ఒకటిగా క్యాన్సర్‌ను చెప్పొచ్చు. దీని బారిన పడితే కోలుకోవడం అంత ఈజీ కాదు. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇది ఖరీదైన చికిత్సగా మారింది. లక్షలకు లక్షలు పోసినా నయం అవుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటి ఈ వ్యాధితో బాధపడుతూ ఎంతో మంది ప్రాణాలు విడిచారు. అయితే ఇక మీదట ఈ పరిస్థితుల్లో మార్పు రానుంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇక మీదట మరింత సులభతరం కానుంది. పైసా ఖర్చు పెట్టకుండానే క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు. ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ ఏంటి? ఎవరు రూపొందించారు? ఎక్కడ అందుబాటులోకి రానుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


తయారు చేసింది వాళ్లే..

రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ టాస్ బయటపెట్టింది. క్యాన్సర్‌ను నయం చేయడానికి ఎంఆర్‌ఎన్‌ఏ అనే టీకాను రష్యా డెవలప్ చేస్తోందని సమాచారం. క్యాన్సర్ రోగులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు పుతిన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వినిపిస్తోంది. 2025 ఆరంభంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. పలు పరిశోధనా సంస్థలతో కలసి రష్యన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ ఈ టీకాను అభివృద్ధి చేసిందని సమాచారం.


క్లినికల్ ట్రయల్స్

ఎంఆర్ఎన్‌ఏ వ్యాక్సిన్‌పై రష్యా ఇప్పటికే చాలా మార్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ జరిపిందని తెలుస్తోంది. విస్తృతంగా పరిశోధనలు, ట్రయల్స్ చేశాకే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయిందట అక్కడ ప్రభుత్వం. కాగా, ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్యాన్సర్ టీకా తయారీ దాదాపుగా పూర్తయిందన్నారు. అప్పటి నుంచి దీని కోసం అందరూ ఎదురుచూడసాగారు. ఇకపోతే, రష్యా టీకా గానీ అందుబాటులోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా రోగులు క్యాన్సర్ వ్యాధి బారి నుంచి బయడపడొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇతర దేశాలకు ఫ్రీగా సరఫరా చేయకపోయినా.. చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


Also Read:

18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్‌ సర్కారు బహిష్కరణ కత్తి!

స్కూటర్‌ బాంబుతో రష్యా టాప్‌ జనరల్‌ హత్య

బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం

For More International And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 11:07 AM