Russia: న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ABN , Publish Date - Oct 30 , 2024 | 09:38 AM
ఉక్రెయిన్‌తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అణు బలగాలు ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ స్పెషల్ డ్రిల్స్‌ను మొదలుపెట్టాయి. ఈ పరిణామంపై రష్యాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు
మాస్కో: ఉక్రెయిన్‌తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అణు బలగాలు ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ స్పెషల్ డ్రిల్స్‌ను షురూ చేశాయి. ఈ పరిణామంపై రష్యాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత సంక్లిష్టమైన దశ వచ్చిందని వ్యాఖ్యానించారు.
కాగా గత 15 రోజుల వ్యవధిలో పుతిన్ ప్రారంభించిన రెండవ సైనిక కసరత్తు కావడం గమనార్హం. అయితే అంతకంతకూ పెరిగిపోతున్న ఈ ఉద్రిక్తతను ఎలా తగ్గించాలో తెలియక పశ్చిమ దేశాల నేతృత్వంలోని నాటో (NATO) కూటమి తలపట్టుకుంటోంది.
రష్యాలోని సుదూర భూభాగాలను సైతం తన లక్ష్య పరిధిలోకి తెచ్చుకునేలా ధీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతలకు ఈ పరిస్థితే కారణంగా ఉంది. పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఎలాంటి దాడికైనా పాల్పడితే దేశ రక్షణ కోసం తన అణ్వాయుధాలను ఉపయోగించడాన్ని పరిశీలిస్తామని రష్యా ఇప్పటికే హెచ్చరించింది.
కాగా రష్యా గత నెలలో అణ్వాయుధాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. అణ్వాయుధేతర దేశాలపై కూడా అణ్వస్త్రాలను ఉపయోగించడానికి అనుమతించేలా మార్పులు తీసుకొచ్చారు. అందుకే పశ్చిమ దేశాలను రష్యా హెచ్చరించింది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో అణ్వాయుధాల వినియోగాన్ని పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
For more Business News and Telugu News