Share News

Russia-Ukraine War: రష్యా మాస్టర్ ప్లాన్.. యుద్ధభూమిలోకి రోబోట్స్

ABN , Publish Date - Jan 19 , 2024 | 07:26 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు కావొస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించింది కానీ, పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ కూడా విజృంభించింది. రష్యా దాడులకు కౌంటర్ ఇస్తూ ఇస్తోంది.

Russia-Ukraine War: రష్యా మాస్టర్ ప్లాన్.. యుద్ధభూమిలోకి రోబోట్స్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు కావొస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించింది కానీ, పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ కూడా విజృంభించింది. రష్యా దాడులకు కౌంటర్ ఇస్తూ ఇస్తోంది. ఈ తరుణంలోనే.. రష్యా తాజాగా ఒక మాస్టర్ ప్లాన్ చేసింది. ఈ యుద్ధంలో తన సైనికులకు రక్షణగా ఒక ప్రత్యేకమైన రోబోని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.


అయితే.. ఈ రోబోట్స్ ఏమీ యుద్ధంలో సైనికులతో కలిసి పోరాడవు. గాయపడిన సైనికులకు అప్పటికప్పుడే చికిత్స చేయడంలో సహాయపడుతాయి. ఒకవేళ ఒక సైనికుడు గాయపడితే.. అప్పుడు రోబోట్ వెంటనే అక్కడికి వెళ్లి, యుద్ధభూమి నుంచి అతడ్ని బయటకు తీసుకొస్తోంది. చూడ్డానికి చాలా చిన్నదిగా, ఒక ట్రాలీలాగా కనిపించే ఈ రోబోని ‘బాంబ్ ట్యాంకర్’ తరహాలోనే డిజైన్ చేశారు. దీని పేరు ‘బ్రతిష్కా’ (Bratishka)గా ఖరారు చేశారు. దీని అర్థం ‘తమ్ముడు’. సకాలంలో సైనికులకు సహాయం చేస్తుంది కాబట్టి, దీనికి ఆ పేరు ఖరారు చేశారు. ఈ రోబోట్ వెనుక భాగంలో రెండు చైన్లతో కట్టేసిన ఒక ట్రాలీ ఉంటుంది. అందులో సైనికుడ్ని ఎక్కించుకుని.. ఇది యుద్ధభూమి నుంచి తీసుకెళ్తుంది. అంతేకాదండోయ్.. ఆయుధ సామాగ్రిని కూడా ఇది ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది.

ఈ రోబోట్‌ని బ్రతిష్కా కాన్‌స్టాంటిన్ అనే రష్యన్ రోబోటిక్స్ ఇంజనీర్ తయారు చేశాడు. దీని పొడవు 1.2 మీటర్లు, బరువు 200 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఈ రోబోట్స్‌లో ఒక ప్రత్యేక కెమెరాని కూడా అమర్చారు. ఇది 150 కిలోగ్రాముల బరువుని మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రోబోట్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 5 నుంచి 6 గంటల వరకు నిరంతరం పని చేస్తుంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓ సైనికుడ్ని ఎక్కించుకొని పరుగులు తీసే ఈ రోబోట్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ రోబోను డాన్‌బాస్‌లోని వార్ జోన్‌లో ఉపయోగిస్తున్నారు. దీనిని వివిధ పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చని అక్కడున్న కమాండర్ తెలిపారు.

Updated Date - Jan 19 , 2024 | 07:26 PM