Shehbaz Sharif: పాక్ 24వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:56 PM
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) 24వ ప్రధానమంత్రి (Prime minister)గా షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif)సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీపీ నేత మురద్ అలీషా, సర్ఫరాజ్ బుగ్తి కూడా హాజరయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోడవంతో భావసారూప్యత కలిగిన పార్టీలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి ముత్తహిద క్వామి మూమెంట్ (ఎంక్యూఎం-పీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్యూ), బలోచిస్థాన్ అవామీ పార్టీ, పాకిస్థాన్ ముస్లింలీగ్ (జడ్), ఐస్తెహెకామ్-ఇ-పాకిస్థాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వాన్ని తిరిగి పట్టాల మీదకు తీసుకురావడం షెహబాజ్ ముందున్న ప్రధాన సవాలుగా చెబుతున్నారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడం మరో సవాలుగా ఉంది.