Share News

Sheikh Hasina: షేక్ హసీనా రాజీనామాకు ముందు.. ఆర్మీ 45 నిమిషాల నోటీసు

ABN , Publish Date - Aug 05 , 2024 | 06:05 PM

రిజర్వేషన్ల కోటా ఆంశం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పీఠాన్నే కుదిపేసింది. ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంపై రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు విరుచుకుపడటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, వెంటనే సైనిక విమానంలో దేశం విడిచి అజ్ఞాత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.

Sheikh Hasina: షేక్ హసీనా రాజీనామాకు ముందు.. ఆర్మీ 45 నిమిషాల నోటీసు

ఢాకా: రిజర్వేషన్ల కోటా ఆంశం బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasing) పీఠాన్నే కుదిపేసింది. ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంపై రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు విరుచుకుపడటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, వెంటనే సైనిక విమానంలో దేశం విడిచి అజ్ఞాత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. 45 నిమిషాల వ్యవధిలోగా పదవిలో నుంచి దిగిపోవాలని ఆర్మీ ఇచ్చిన నోటీసు నేపథ్యంలో శరవేగంగా ఈ పరిణామాలు చేటుచేసుకున్నాయి.

Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా


ఇలా జరిగింది..

-సైనిక విమానంలో దేశం విడిచిపెట్టి 'అజ్ఞాత ప్రాంతానికి' షేక్ హసీనా వెళ్లిపోవడం దావానలమైంది. ఆమె లండన్‌కు వెళ్తున్నారని, ఢిల్లీలో ఆగవచ్చని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఢిల్లీ వైపు వస్తున్న సి-130 ఎయిర్‌క్రాఫ్ట్ కదలికను భారత భద్రతా బలగాలు మానిటర్ చేస్తున్నారు. ఇందులో షేక్ హసీనా, కొంత మంది ఆమె సహచరులు ఉండవచ్చని తెలుస్తోంది.

-ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వివరాల ప్రకారం, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని షేక్ హసీనా అనుకున్నప్పటికీ హింస తీవ్రత దృష్ట్యా ఆ ప్రతిపాదనను ఆమె భద్రతా సిబ్బంది తోసిపుచ్చారు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె భద్రతా సిబ్బంది చెప్పడంతో జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయం కూడా షేక్ హసీనాకు లేకపోయిందని చెబుతున్నారు.

-హసీనా రాజీనామా చేసిన వెంటనే ఆర్మీ చీఫ్ జనరల్ వకెర్-ఉల్-జమాన్ టీవీ సందేశం ఇస్తూ, సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, ఆందోళనకారులు శాంతించాలని పిలుపునిచ్చారు.

-''సంక్షోభం ఉంది. విపక్ష నేతలను కలుసుకున్నాను. దేశాన్ని పాలించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేమంతా కలిసి నిర్ణయించాం. నేను ఆ బాధ్యతలను తీసుకుంటున్నాను. మీ ప్రాణాలు, ఆస్తులను పరిరక్షిస్తానని హామీ ఇస్తున్నారు. మీ డిమాండ్లు పరిష్కారమవుతాయి. దయజేసి హింసను ఆపండి'' అని ఆర్మీ చీఫ్ జనరల్ కోరారు.

-మరోవైపు భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. బంగ్లా సరిహద్దు వెంబడి హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ ఫీల్డ్ కమాండర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది.

-బంగ్లాలో రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ఉదయం ప్రధాని అధికారిక నివాసమైన గోనోభభన్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఆ సమయానికే షేక్ హసీనా దేశం మిలటరీ హెలికాప్టర్‌లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఆమె చెల్లెలు షేక్ రెహనా కూడా అందులో బయలుదేరారు.

-పోలీసులకు, నిరసనకారులకు మధ్య గత ఆదివారంనాడు చెలరేగిన ఘర్షణలో100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు. గత నెలలో చెలరేగిన ఈ నిరసనలు ఆదివారంనాడు తారాస్థాయికి చేరుకున్నారు.

-కేంద్రం తీసుకున్న కోటా సిస్టమ్‌ నిర్ణయం ఈ ఘర్షణలకు దారితీసింది. పాకిస్థాన్‌పై 1971లో జరిగిన బంగ్లా్ యుద్ధంలో అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం వరకూ రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

-రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ మొదలైన నిరసనలు క్రమంగా దేశంలోని ప్రముఖ రంగాలకు కూడా విస్తరించడంతో ఆందోళనలను తీవ్రమయ్యాయి.

-బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 5 శాతానికి కత్తిరించింది. దాంతో విద్యార్థి నాయకులు నిరసనలను తాత్కాలికంగా ఆపేశారు. అరెస్టు చేసిన తమ నేతలను విడిచిపెట్టాలంటూ విద్యార్థి సంఘాల పిలుపును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఈసారి ఆందోళనకారులు నేరుగా షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో అమీతుమీకి దిగారు. ప్రధాని భవనంపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.

Updated Date - Aug 05 , 2024 | 06:05 PM