America : బోయింగ్ కు తప్పిన పెను ప్రమాదం.. ఘటనపై క్షమాపణలు..
ABN , Publish Date - Apr 08 , 2024 | 10:03 AM
అమెరికా ( America ) లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ జెట్ బోయింగ్-737 కు పెను ప్రమాదం తప్పింది. సదరు విమానయాన సంస్థకు వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. హ్యూస్టన్ కు వెళ్తున్న బోయింగ్ విమానం ఇంజిన్ కవర్ విడిపోయి వింగ్ ఫ్లాప్‌ను తాకింది.
అమెరికా ( America ) లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ జెట్ బోయింగ్-737 కు పెను ప్రమాదం తప్పింది. సదరు విమానయాన సంస్థకు వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. హ్యూస్టన్ కు వెళ్తున్న బోయింగ్ విమానం ఇంజిన్ కవర్ విడిపోయి వింగ్ ఫ్లాప్‌ను తాకింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని డెన్వర్ లో అత్యవసర ల్యాండిగ్ చేశారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి పంపించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని, వారి భద్రతే తమ సంస్థ లక్ష్యమని విమానయాన సంస్థ వెల్లడించింది.
Mozambique Coast: మొజాంబిక్ తీరంలో విషాదం.. బోటు మునిగి 91 మంది మృతి
కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. నోస్‌వీల్ ఊడిపోయింది. పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్ చేయకుండా నిలిపివేశారు. ప్రమాద సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.