Share News

Taliban: ఫుట్‌బాల్ స్టేడియంలో ఇద్దరికి బహిరంగ మరణశిక్ష విధించిన తాలిబన్లు!

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:47 PM

హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు నిందితులకు తాలిబన్లు బహిరంగ గురువారం మరణ శిక్ష విధించారు.

Taliban: ఫుట్‌బాల్ స్టేడియంలో ఇద్దరికి బహిరంగ మరణశిక్ష విధించిన తాలిబన్లు!

ఇంటర్నెట్ డెస్క్: హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు తాలిబన్లు (Taliban) గురువారం బహిరంగ మరణ శిక్ష (Public Execution) విధించారు. ఘాజ్నీ నగరంలోని (Ghazni) ఓ స్టేడియంలో దోషులను పలుమార్లు తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ శిక్షను వీక్షించేందుకు వేల మంది స్టేడియానికి తరలివచ్చారు.

Mine Collapse: కూలిన గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు


మరణ శిక్షకు ముందు సుప్రీం కోర్టు అధికారి సర్వోన్నత న్యాయస్థానం తీర్పును (Death Warrant) చదివారు. ఈ తీర్పుపై అంతకుమునుపే తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అకున్ద్‌జాదా కూడా సంతకం చేశారు. తీర్పు చదవడం పూర్తయ్యాక వారిపై పలుమార్లు కాల్పులు జరిపి శిక్ష అమలు చేశారు. ‘‘ ఓ హత్య నేరం కేసులో ఈ ఇద్దరూ దోషులు. రెండేళ్ల పాటు విచారణ అనంతరం, తీర్పు వెలువడింది’’ అని తాలిబన్లు ఓ ప్రకటనలో తెలిపారు. మరణ శిక్ష అమలును వీక్షించేందుకు దోషుల కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు.

Updated Date - Feb 22 , 2024 | 05:55 PM