Voter List: ఎల్లుండి నుంచే ఎన్నికలు.. ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేసుకున్నారా?
ABN , Publish Date - Apr 17 , 2024 | 06:00 PM
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha Elections 2024) హాడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి నుంచే (ఏప్రిల్ 19న) మొదలు కానుంది. ఈ క్రమంలో ఓటరు జాబితా(voter list)లో మీ పేరును ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha Elections 2024) హాడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి నుంచే (ఏప్రిల్ 19న) మొదలు కానుంది. అయితే ఈసారి దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో అనేక మంది తమ వయోజన ఓటు(vote) హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా అనేక మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారు సైతం ఓటు వేయనున్నారు.
కానీ మీకు ఓటర్ ఐడి(voter id) లేకపోతే మీరు ఓటు వేయలేరు. మీకు ఓటర్ ఐడి కార్డ్ ఉంటే మీరు మొదట జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే మీ రాష్ట్రంలో ఎన్నికల రోజు వచ్చే ముందు, మీరు ఓటరు జాబితాలో మీ పేరును తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. మీ పేరు జాబితాలో ఉంటే మాత్రమే మీరు ఓటు వేయవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకోసం మీరు ఇంట్లో కూర్చొని ఈ పనిని చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఓటరు జాబితా(voter list)లో మీ పేరును ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
స్టెప్ 1 దీని కోసం ముందుగా మీరు https://nvsp.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి
స్టెప్ 2 - అక్కడ మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి, వాటిలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్(Search in Electoral Roll)పై క్లిక్ చేయండి
స్టెప్ 3 - ఆ తర్వాత ఒక వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు Search by EPIC, Search by Details, Search by Mobile ఆప్షన్లను ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలి
స్టెప్ 4 - అందులో మీరు Search by Mobile ఆప్షన్ ఎంచుకుంటే మీ ఫోన్ నంబర్, రాష్ట్రం, భాష, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి
స్టెప్ 5 - దీని తర్వాత క్రింద అడిగిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 6 - అప్పుడు మీ ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయడం ద్వారా మీ ఓటు వివరాలను తెలుసుకోవచ్చు
SMS ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరును తనిఖీ చేసుకోవచ్చు
స్టెప్ 1 - దీని కోసం మీరు మీ ఫోన్ నుంచి టెక్స్ట్ సందేశాన్ని పంపాలి
స్టెప్ 2 - EPIC వ్రాసి దానితో పాటు ఓటర్ ID కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి
స్టెప్ 3 - తర్వాత ఆ సందేశాన్ని 9211728082 లేదా 1950కి పంపండి
స్టెప్ 4 - దీని తర్వాత మీ నంబర్‌కు సందేశం వస్తుంది, అందులో మీ పోలింగ్ నంబర్, పేరు వ్రాయబడుతుంది
స్టెప్ 5 - ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం అందదు గుర్తుంచుకోండి
ఇది కూడా చూడండి:
మాకు సంబంధం లేదు.. మేము పట్టించుకోం..: మోదీ వ్యాఖ్యలపై మాథ్యూ మిల్లర్
Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర
మరిన్ని జాతీయ వార్తల కోసం