Share News

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:00 AM

ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్
Ukrainian President Zelensky

గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్(ukraine), రష్యా యుద్ధం(russia war) మరికొన్ని రోజుల్లో ఆగిపోనుందా. అంటే పలువురు అవునని చెబుతుండగా, మరికొంత మంది మాత్రం కాదంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధం ముగించేందుకు తన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లకు త్వరలో అందజేయనున్నారు. ఆయన ఈ ప్రతిపాదనకు విక్టరీ ప్లాన్ 'జీత్ కి యోజన' అని పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రణాళికను వివరించడానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికను వారికి తెలిపేందుకు జెలెన్స్కీ ఆదివారం అమెరికా చేరుకున్నారు.


ముగించేందుకు

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం రెండున్నరేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో మాస్కో తూర్పు ఉక్రెయిన్‌లోకి వేగంగా పురోగమిస్తుండగా, రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని కీలక భాగాలను కీవ్ స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉపయోగించమని కీవ్ పశ్చిమ దేశాలపై ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రేనియన్ అధ్యక్షుడు వచ్చే గురువారం వైట్ హౌస్‌లో బైడెన్‌ను కలిసినప్పుడు, తన మనసు మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చని అంటున్నారు. యుద్ధం ముగించేందుకు ప్రణాళికను అందించనున్నట్లు తెలుస్తోంది.


సందర్శన

అమెరికా పర్యటనలో భాంగంగా 155 మిమీ ఫిరంగి గుండ్లు ఉత్పత్తి చేసే పెన్సిల్వేనియాలోని ఫ్యాక్టరీని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆదివారం సందర్శించారు. ఆ క్రమంలో ఆదివారం సందర్శన ఫోటోను వోలోడిమిర్ జెలెన్స్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో ఫ్యాక్టరీ కార్మికులతో కరచాలనం చేయడం, అలాగే ఫ్యాక్టరీ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా పర్యటనను ప్రారంభించారు. ఉత్పత్తి పెరిగింది, ఇలాంటి చోట్ల ప్రజాస్వామ్య ప్రపంచం గెలవగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వేలాది మందిని చంపిన 30 నెలలకు పైగా పోరాటం ఎలా ముగుస్తుందో రాబోయే వారాలు నిర్ణయిస్తాయని జెలెన్స్కీ అన్నారు.


ప్లాన్ ఏంటి?

సందర్శనకు ముందు యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉపయోగించడానికి కీవ్‌కు అనుమతి ఇవ్వలేదని జెలెన్స్కీ అన్నారు. ఎందుకంటే వారు సంఘర్షణను తీవ్రతరం చేస్తారనే భయంతో ఉన్నారు. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తాను ఏ ఆశను వదులుకోవడం లేదన్నారు. బైడెన్‌తో భవిష్యత్ సంబంధాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బైడెన్‌కు సన్నిహిత సలహాదారు ఈ నెలలో యూఎస్ ఉక్రెయిన్‌ను బలోపేతం చేయడానికి తమ మిగిలిన సమయాన్ని ఉపయోగిస్తారని చెప్పారు.

అయితే ఉక్రెయిన్ ప్రణాళికకు సంబంధించిన వివరాలేవీ బహిరంగపరచబడలేదు. ప్రణాళికను పూర్తిగా తెలుసుకున్న మొదటి నేత బైడెన్ అని జెలెన్స్కీ అన్నారు. జెలెన్స్కీ ఈ ప్రణాళిక గురించి US చట్టసభ సభ్యులు, హారిస్, ట్రంప్‌లకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ హారిస్‌, బైడెన్‌తో విడిగా కలుస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు మరింత సపోర్ట్ చేసి యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తారా లేదా రష్యాపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు.. వీటిలో కొన్ని..

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreInternational News and Latest Telugu News

Updated Date - Sep 23 , 2024 | 10:02 AM