Donald Trump: జో బైడెన్‌కు ఛాలెంజ్ విసిరిన డోనాల్డ్ ట్రంప్.. ఎవరు గెలుస్తారు?
ABN , Publish Date - Mar 07 , 2024 | 10:04 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పోటీ నిర్ణయించబడిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ బైడెన్‌కు ఛాలెంజ్ విసిరారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల(us elections 2024)కు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పోటీ నిర్ణయించబడిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బైడెన్(Joe Biden)కు ఛాలెంజ్(challenge) విసిరారు. తాను అమెరికాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చకు సిద్ధమని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో బైడెన్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. నేను ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని వెల్లడించారు. మార్చి 5న జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌పై దాదాపు క్లీన్ స్వీప్‌లో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌ను సవాలు చేస్తున్న ఏకైక అభ్యర్థి నిక్కీ హేలీ కూడా బుధవారం మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కానున్న అంశాల్లో ఆర్థికం, అక్రమ వలసదారులు, విదేశాంగ విధానం, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యం వంటి అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల సమస్యపై దృష్టి పెట్టనున్నారు. ఇటీవల, ట్రంప్ అమెరికా-మెక్సికో సరిహద్దును కూడా సందర్శించారు. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికా(america)లోకి ప్రవేశించారు.
ట్రంప్(Donald Trump) అనేక సార్లు తన బహిరంగ సభలలో, అక్రమ వలసదారుల సమస్యపై బైడెన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యానించారు. బైడెన్ హయాంలో కోవిడ్ సంక్షోభం నుంచి అమెరికా బయటపడిందా, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని అమెరికన్ ప్రజలు నమ్ముతున్నారా అంటూ పలు ప్రశ్నలను సంధించారు. ఈ క్రమంలో ఆర్థిక పరంగా ట్రంప్ పదవీకాలానికే అమెరికా ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
అయితే నిక్కీ హేలీ(nikki haley) కూడా చాలాసార్లు ట్రంప్‌కు సవాల్ విసిరారు. కానీ ట్రంప్ ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు 2020లో జరిగిన ఎన్నికలకు పునరావృత్తమైనట్లు కనిపిస్తున్నాయి. ఇందులో కూడా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ జరిగింది. హోరాహోరీ పోటీలో జో బైడెన్ గెలుపొందగా ట్రంప్ ఓటమిపాలయ్యాడు. కానీ ఈసారి మాత్రం ట్రంప్ గెలిచి బైడెన్ ఓడిపోనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IND vs ENG 5th Test: కొత్త ప్లేయర్ ఎంట్రీ.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా