Share News

US Crime: తల్లి కాదు.. రాకాసి.. కూతురిని చంపి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Nov 19 , 2024 | 05:12 PM

ఘటనపై విచారణకు వచ్చిన పోలీసులే ఆ బాలిక మృతదేహాన్ని చూసి చలించిపోయారు. 30 ఏళ్లలో ఇంతటి క్రూరమైన ఉదంతాన్ని తాము చూడలేదన్నారు. బాలిక మరణించే సమయానికి ఆమె శరీరంపై ఒక్క డైపర్ మాత్రమే ఉందని..

US Crime: తల్లి కాదు.. రాకాసి.. కూతురిని చంపి ఏం చేసిందంటే..
US Women crime

వాషింగ్టన్: తల్లిని మించిన దైవం లేదంటారు. కానీ, ఓ తల్లి కూతురన్న విచక్షణ మరిచి కర్కోటకురాలిగా మారింది. 13 ఏళ్ల కూతురిపట్ల అమానుషత్వం ప్రదర్శించింది. చివరికి ఆ బాలిక చావుకి కారణమైంది. అమెరికాకు చెందిన ఫ్లోరిడాలో డయాన్నే నటాషా మాక్ అనే మహిళ ఓ బాలికను దత్తత తీసుకుంది. ఆమె లాలనలో తల్లి లేని లోటును మర్చిపోవాలనుకుందా చిన్నారి. కానీ, ఆమె తన పాలిట మృత్యువుగా మారుతుందని ఊహించి ఉండదు. చివరకు ఆ మహిళ చేతిలోనే చిత్రహింసలకు గురై కన్నుమూసింది. ఘటనపై విచారణకు వచ్చిన పోలీసులే ఆ బాలిక మృతదేహాన్ని చూసి చలించిపోయారు. 30 ఏళ్లలో ఇంతటి క్రూరమైన ఉదంతాన్ని తాము చూడలేదన్నారు. బాలిక మరణించే సమయానికి ఆమె శరీరంపై ఒక్క డైపర్ మాత్రమే ఉందని.. చాలా రోజులుగా ఆకలితో అలమటించి శారీరకంగా చిత్రహింసలకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు.


నిందితురాలు కొంత కాలంగా బాలికను గ్యారేజీలో కట్టి ఉంచినట్టు పోలీసులకు కనుగొన్నారు. అయితే, నటాషా బాలికను చంపి ఆ తర్వాత తన కుమార్తె అపస్మారక స్థితిలో గ్యారేజీలో పడి ఉందని పోలీసులకు సమాచారం అందించింది. కానీ, ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలను గుర్తించిన పోలీసులు నిందితురాలని తమదైన స్టైల్లో విచారించారు. కొంతకాలంగా బాలికను గ్యారేజీలో బంధించి సీసీటీవీ ఫుటేజీ ద్వారా గమనిస్తున్నట్టు వారు తెలిపారు. ఆ తర్వాత తన నలుగురు పిల్లలతో కలిసి నిందితురాలు పారిపోయిందన్నారు. ఈ చిన్నారి కేసులో న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితురాలు ఏ కారణం చేత దత్తత తీసుకున్న కూతురిపై ఇలా చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. పిల్లలపై చేయి చేసుకోవడం అమానుషంగా ప్రవర్తించడం అమెరికా చట్టాలలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు నిందిత మహిళకు కఠిన శిక్ష పడే అవకాశాలున్నాయి.

Viral News: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం ఇదే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సెన్షేషనల్ కామెంట్స్..


Updated Date - Nov 19 , 2024 | 06:02 PM