Share News

US Presidential Debate: బైడెన్ కీలక వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన ట్రంప్

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:25 PM

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు(us presidential election 2024) జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్(joe biden), అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం

US Presidential Debate: బైడెన్ కీలక వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన ట్రంప్
US Presidential Debate

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు(us presidential election 2024) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్(joe biden), అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకోసం ఏం వ్యాఖ్యలు చేసుకున్నారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.


క్రిమినల్ అని..

చర్చ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్(donald trump) చాలా దూకుడుగా కనిపించారు. 90 నిమిషాల చర్చలో ట్రంప్ చాలా వాదనలు చేశారు. ఈ క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు ఆరోపణలు చేసుకున్నారు. బైడెన్(biden).. ట్రంప్‌ను నేరస్తుడని, అబద్ధాలకోరు, అసమర్థుడని పేర్కొన్నారు. స్పందించిన ట్రంప్.. బైడెన్ కుమారుడిని క్రిమినల్ అని అభివర్ణించారు. బైడెన్ మాట్లాడుతున్న క్రమంలో తడబడినప్పుడు, ఆయన ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.


యుద్ధం జరిగేది కాదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని(russia ukraine war) ఆపడానికి బైడెన్ ఏం చేయలేదని ట్రంప్ అన్నారు. బైడెన్ యుద్ధాన్ని ఆపడానికి బదులుగా దానిని పెంచడానికి పనిచేశారని వ్యాఖ్యానించారు. తాను దేశానికి అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని ట్రంప్ తెలిపారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్తుడని, రష్యాను సోవియట్ సమాజంగా మార్చాలనుకుంటున్నారని వెల్లడించారు.


ఎఫైర్ పెట్టుకున్నాడు..

ఇంకా జో బైడెన్ ట్రంప్‌నకు అడల్ట్ స్టార్‌తో ఎఫైర్ ఉందని ఆరోపించారు. బైడెన్ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కేసులో ఇరికించారని అన్నారు. బైడెన్ అధ్యక్ష పదవీకాలం అమెరికా(america) చరిత్రలోనే అత్యంత నీచమైన కాలమని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇక క్యాపిటల్ హిల్ అల్లర్ల విషయంలో ట్రంప్‌ను బైడెన్ నిందించారు. ట్రంప్ ఈ కేసులో దోషి అని వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఇద్దరు నేతలు అనేక ఆరోపణలు చేసుకున్నారు. కానీ మొత్తం చర్చ సమయంలో జో బైడెన్ పొరపాట్లు చేయడం, మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ఈ క్రమంలోనే మళ్లీ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయ్యి, దేశాన్ని సవాళ్ల నుంచి రక్షిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే


Read Latest International News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 01:36 PM