Viral Video: అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతులు, కాళ్లు కట్టేశారు.. కిడ్నాప్ నిజమేనా?
ABN , Publish Date - Mar 31 , 2024 | 10:34 AM
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(us president elections) జరగనున్నాయి. దీని కోసం అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య రసవత్తరమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(us president elections) జరగనున్నాయి. దీని కోసం అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య రసవత్తరమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దాని వెనుక బైడెన్ చేతులు, కాళ్ళు కట్టేసి ఉన్నట్లు చిత్రం ఉంది. అది ట్రక్కు వెనుక భాగంలో అంటించినట్లుగా కనిపిస్తుంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
న్యూయార్క్(new york)లోని లాంగ్ ఐలాండ్‌లో గురువారం నాడు ఈ వీడియోను రూపొందించినట్లు అందులో క్యాప్షన్ ఉంది. సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్న వీడియోపై బైడెన్ ప్రచారం బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. డెమొక్రటిక్ అధ్యక్షుడికి భౌతిక హానిని సూచించే వీడియోను వారు ఖండించారు. ఈ క్రమంలో ట్రంప్ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని బైడెన్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకునే సమయం వచ్చిందన్నారు. జనవరి 6న జరిగిన హింస వెనుక ఎవరున్నారో కాపిటల్ పోలీసు అధికారులను ఆడగాలని పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: BJP: ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ
2024 ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా ఆటో పరిశ్రమకు, దేశానికి రక్తపాతానికి దారితీస్తుందని ఈ నెల ప్రారంభంలో ట్రంప్(donald trump) వ్యాఖ్యలు చేశారు. అమెరికా వెలుపల తయారయ్యే కార్లపై 100 శాతం సుంకాలు విధించాలని ఆయన ప్రతిపాదించారు. ఇక ఈ ఫోటో వీడియోపై చూసిన ప్రజలు బైడెన్ నిజంగానే కిడ్నాప్ అయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని(US President) వీలైనంత త్వరగా విడుదల చేయాలని కొందరు కోరారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ వీడియో 'డోనాల్డ్ ట్రంప్ పోస్ట్‌లు హిజ్ ట్రూత్ సోషల్' అనే సామాజిక ఖాతా నుంచి పోస్ట్ చేయబడిందని తేలింది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి వినియోగిస్తున్న ట్రక్కు వెనుక భాగంలో ఈ పోస్టర్ ఉండటం వీడియోలో కనిపిస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే