Viral Powerful Speech: చావడానికే కాదు.. బతకడానికీ సిద్ధమే.. వైరల్ గా మారిన ఎంపీ స్పీచ్..
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:00 PM
రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కొందరు అనర్గళంగా మాట్లాడగలిగితే..
రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కొందరు అనర్గళంగా మాట్లాడగలిగితే.. మరికొందరు తడబడుతూ పొంతన లేని ప్రసంగాలు చేస్తుంటారు. అందుకే.. ప్రజాసేవలో మమేకమైన రాజకీయ నాయకులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలి. తాజాగా ఓ ఎంపీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 21 ఏళ్ల వయసున్న హనా-రౌహితీ మైపి-క్లార్క్ ఎంపీగా పనిచేస్తున్నారు. 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె మాట్లాడే ప్రతీ ప్రసంగం ఓ సంచలనం.. చిన్న ముక్కలో చెప్పాలంటే.. ఆమెనే ఓ సంచలనం. "నేను మీ కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నాను.. అంతే కాదు నేను మీ కోసం జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని".. ఉద్వేగభరితంగా పార్లమెంట్‌లో తాజాగా ప్రసంగించారు.
ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న చిన్న పట్టణమైన హంట్లీ మైపి-క్లార్క్ స్వస్థలం. అక్కడ ఆమె ఒక కమ్యూనిటీ గార్డెన్‌ను నడుపుతున్నారు. దీని ద్వారా పిల్లలకు తోటపని గురించి అవగాహన కల్పిస్తున్నారు. తనను తాను రాజకీయ నాయకురాలిగా చూడడం లేదని, మావోరీ భాష సంరక్షకురాలిగా చూసుకుంటునాన్నారు. రాబోయే తరానికి భాషా సంపదను అందించాల్సిన అవసరం తనపై ఉందని అన్నారు మైపి.
పార్లమెంట్‌లోకి ప్రవేశించే ముందు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏమీ తీసుకోకూడదని సలహా ఇచ్చారు. కానీ నేను పర్సనల్ గా తీసుకోకుండా ఉండలేకపోతున్నా. కేవలం రెండు వారాల్లోనే ఈ ప్రభుత్వం నాపై దాడి చేసింది. ఈ క్షణం.. నా ప్రసంగం చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది అని ఎంపీ ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి