Vladimir Putin: ఆ తప్పు చేస్తే ‘అణు యుద్ధం’ తప్పదు.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Mar 13 , 2024 | 06:33 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కి (Ukraine) మద్దతుగా అమెరికా (America) తన సైన్యాన్ని పంపితే.. అణు యుద్ధం (Nuclear War) తప్పదని హెచ్చరించారు. తమ దేశం అణు యుద్ధానికి సాంకేతికంగా సిద్ధంగా ఉందన్న ఆయన.. ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపితే, అది యుద్ధానికి ఆజ్యం పోసినట్లుగా పరిగణించబడుతుందని అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కి (Ukraine) మద్దతుగా అమెరికా (America) తన సైన్యాన్ని పంపితే.. అణు యుద్ధం (Nuclear War) తప్పదని హెచ్చరించారు. తమ దేశం అణు యుద్ధానికి సాంకేతికంగా సిద్ధంగా ఉందన్న ఆయన.. ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపితే, అది యుద్ధానికి ఆజ్యం పోసినట్లుగా పరిగణించబడుతుందని అన్నారు. మార్చి 15-17 మధ్య రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అణు యుద్ధానికి రష్యా నిజంగానే సిద్ధంగా ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ బదులిస్తూ.. సైనిక-సాంకేతిక దృక్కోణంలో తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. అయితే.. అందుకు తాము తొందరపడటం లేదని, తమకూ కొన్ని విధివిధానాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయం అమెరికాకి కూడా తెలుసని.. రష్యా-అమెరికా మధ్య సంబంధాలపై వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలామంది నిపుణులు ఉన్నారని తెలిపారు. ఒకవేళ ఉక్రెయిన్‌కి మద్దతుగా సైన్యాన్ని పంపితే మాత్రం.. అప్పుడు ఈ యుద్ధంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకున్నట్లే అవుతుందన్నారు. అదే జరిగితే తాము అందుకు తప్పకుండా ధీటుగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో.. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని వెల్లడించారు. కానీ.. ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలని సూచించారు.
మరోవైపు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా ఘాటుగా బదులిచ్చింది. అణు యుద్ధం ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలను బాధ్యతారహితంగా పేర్కొంది. పుతిన్ ఇలా మాట్లాడటం మొదటిసారి కాదని, అణ్వాయుధ రాజ్య నాయకుడు ఇలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ (Mathew Miller) అన్నారు. అణ్వాయుధ వినియోగం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తాము గతంలోనే రష్యాతో ప్రైవేట్‌గా, ప్రత్యక్షంగా మాట్లాడామని గుర్తు చేశారు. రష్యా అణ్వాయుధాన్ని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తమకు ఎలాంటి సంకేతాలు అందలేదన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి