Washington : మహిళకు ముద్దుపెట్టబోయిన అమెరికా అధ్యక్షుడు!
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:29 AM
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వింత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అధ్యక్ష పదవికి పోటీ
బైడెన్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్, జూలై 19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వింత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే బైడెన్ వేదికలపై విచిత్రంగా ప్రవర్తించడం గమనార్హం. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఎప్పటిదనేది తెలియరాలేదు గానీ, అందులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. వేదికపై ఓ మహిళతో మాట్లాడుతూ అతి దగ్గరగా వెళ్లారు. ఇంకొంచెమైతే ముద్దు పెట్టేసేవారే.. అనిపించింది! పక్కనే ఉన్న ఆయన భార్య జిల్ అప్రమత్తమై ఆయన్ను ఆపినట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆ మహిళను అక్కడి నుంచి పంపారు. బైడెన్ మానసిక ఆరోగ్యంపై తలెత్తుతున్న అనుమానాలకు బలం చేకూర్చేలా తాజా వీడియో ఉండడం గమనార్హం.