Share News

Vanga Baba Predictions: ట్రంప్‌, పుతిన్‌కు తొలగని ప్రాణహాని? వంగాబాబా భయంకర జోస్యం

ABN , Publish Date - Jul 15 , 2024 | 08:23 AM

పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ (20) అనే దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవిపై నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది.

Vanga Baba Predictions: ట్రంప్‌, పుతిన్‌కు తొలగని ప్రాణహాని? వంగాబాబా భయంకర జోస్యం

న్యూయార్క్: పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ (20) అనే దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవిపై నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది.

అయితే ట్రంప్‌పై దాడి జరుగుతుందని ప్రఖ్యాత వంగాబాబా ముందే చెప్పారు. ట్రంప్‌‌నకు అంతుచిక్కని వ్యాధి వల్ల చెవుడు వస్తుందని, బ్రెయిన్ ట్యూమర్ కూడా వస్తుందని బాబా వంగా చెప్పినట్లు తెలుస్తోంది.


వంగాబాబా ఎవరు..

బాబా వంగా(Vanga Baba) బల్గేరియాకు చెందిన ప్రవక్త. ఆమె అసలు పేరు వాంజెలియా పాండేవా దిమిత్రోవ్. ఆమె 1911లో జన్మించారు. కానీ 12 సంవత్సరాల తుపాను దుమ్ము వల్ల కంటిచూపు కోల్పోయారు. భవిష్యత్తులో జరిగే మార్పులు ఆమెకు కనిపించడం ప్రారంభించాయని అంటుంటారు. వంగాబాబాను రష్యా, ఐరోపాలో సాధువుగా గౌరవిస్తారు. 1996 లో 85 సంవత్సరాల వయస్సులో వంగాబాబా మరణించారు. ఆమె 5,079 సంవత్సరాల వరకూ ప్రపంచం ఎలా ఉంటుందో అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఏ సంవత్సరంలో ఏ దేశానికి, ఏ నాయకుడికి ఎలాంటి విపత్తు వస్తుందో ఆమె ముందే చెప్పారని అంటుంటారు.


వాటిలో చాలా వరకు నిజం కావడంతో ఆమెకు జోస్యాలకు విలువ పెరిగింది. అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడులను వంగ బాబా ముందే సరిగ్గా అంచనా వేసినట్లు చెబుతుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై చెప్పిన జోస్యం కూడా నిజమైంది.

బాబా వంగా 2024 సంవత్సరంలో ఏం జరగబోతోందో కూడా అంచనా వేశారు. ది మిర్రర్ ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై 2024లో హత్యాయత్నం చేస్తారని వంగాబాబా ముందే చెప్పారు. ఈ ఏడాది అటు ట్రంప్‌నకు, పుతిన్‌కు ప్రాణ గండం ఉంటుందని ఆమె జోస్యం సారాంశం. 2016 నాటికి ఐరోపా అంతమవుతుందని, 2010 - 2014 మధ్య అణు యుద్ధం జరుగుతుందని ఆమె చెప్పిన జోస్యం నిజం కాలేదు. అయినప్పటికీ ఆమె జోస్యాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.

Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 08:23 AM