Share News

Tulasi Gabbard: ట్రంప్ వనంలో ‘తులసీ గబ్బార్డ్’.. ఎవరీ లేడీ ఫైర్‌బ్రాండ్

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:05 PM

ట్రంప్ మెచ్చిన తులసి గబ్బార్డ్ భారతీయురాలేనని ఆమె పేరు చూసి అంతా పొరబడుతున్నారు. కానీ, ఆమె పేరు వెనుక అసలు స్టోరీ చాలానే ఉంది..

Tulasi Gabbard: ట్రంప్ వనంలో ‘తులసీ గబ్బార్డ్’.. ఎవరీ లేడీ ఫైర్‌బ్రాండ్
Tulasi Gabbard

తులసి గబ్బార్డ్.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన వెంటనే కీలక పదవులను అధిరోహించిన వారిలో ఆమె ఒకరు. చివరి క్షణంలో పార్టీలో చేరిన తులసికి ఏకంగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో ఆమె అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా ఏజెన్సీలకు హెడ్ గా మారారు.


హిందువే కానీ హిందువు కాదు

2022లో డెమొక్రటిక్ పార్టీని వీడిన తర్వాత ఆమె రిపబ్లికన్ పార్టీలో ఈ ఏడాది ప్రారంభంలో చేరారు. ఆమె అమెరికాకు కీర్తిని తెస్తుందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. మొదట రష్యా ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఉక్రెయిన్ కు మద్దతునివ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు తనకు అత్యున్నత పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె పేరు విని అంతా ఆమెను భారతీయురాలని పొరబడుతుంటారు. కానీ, ఆమె అమెరికా పౌరురాలేనని తెలిపింది. హిందువు కాకపోయినా హిందూ మతాన్ని స్వీకరించారు. భగవద్గీత చదవడంతో పాటు విష్ణు భక్తురాలిగా మారారు. ఆమె గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..


సినిమాటోగ్రఫర్ తో పెళ్లి..

తులసి అమెరికాలోని లియోనోలాలో 12 ఏప్రిల్ 1981లో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియానాకు చెందినవారు. తులసికి రెండేళ్లున్నప్పుడే వీరి కుటుంబం హవాయీ దీవుల్లో స్థిరపడింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన తులసి అబ్రహం విలియమ్స్ అనే సినిమాటోగ్రఫర్ ను పెళ్లి చేసుకున్నారు.


తన తల్లికి హిందుత్వంపై ఉన్న మమకారం కారణంగా తన పిల్లలందరికీ హిందూ పేర్లనే పెట్టారు. చిన్నతనం నుంచే హిందూ ఆచారాలను పాటిస్తూ పెరిగిన తులసి కూడా వైష్ణవ భక్తురాలిగా మారారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేస్తుంటారు. గతంలో పదవీ స్వీకారం సమయంలోనూ ఆమె భగవద్గీతపై ప్రమాణం చేయడం అందరిని ఆకర్షించింది. తనను చూసిన వారంతా భారతీయురాలని పొరబడుతుండటంతో ఈ విషయంపై తులసి క్లారిటీ ఇచ్చారు. తాను భారత పౌరురాలిని కాదంటూ 2012లోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Bumper Offer: ఓరి నాయనో.. శృంగారాన్ని ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ..


Updated Date - Nov 14 , 2024 | 04:05 PM