Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం
ABN , Publish Date - Jan 22 , 2024 | 08:52 AM
మధ్యప్రదేశ్లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.
భోపాల్: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఆ గడియల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరాముని (Ram) నామ స్మరణ మారుమోగుతోంది. అయోధ్యలో జరిగే క్రతువు కనులారా వీక్షించేందుకు హిందు సంస్థలు, బీజేపీ కార్యాలయాలు భారీ తెరలను ఏర్పాటు చేశాయి. మధ్యప్రదేశ్ బీజేపీ ఆఫీసు దగ్గరలో గల ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. రామాయణ పఠనాన్ని 108 మంది అంధులు చేస్తున్నారు. బ్రెయిలీ లిపి ద్వారా 24 గంటలపాటు ఏకధాటిగా రామాయాణాన్ని పఠిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు యజ్ఞ పూజతో రామాయణ పఠనం ముగియనుంది. అయోధ్య వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కార్యాలయంలో భారీ తెరను ఏర్పాటు చేశామని పార్టీ ఆఫీసు ఇంచార్జీ రాఘవేంద్ర శర్మ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.