Share News

Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:47 PM

బిహార్‌లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
Bihar CM Nitish Kumar

పట్నా, జులై 05: బిహార్‌లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదీకాక రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన నితీష్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది.

Also Read: Lalu Prasad Yadav: త్వరలో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు.. సిద్దంకండి

అందులోభాగంగా ఈ వంతెనలు కూలిపోతున్న ఘటనల్లో మొత్తం 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు నితీష్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కులిపోయిన వాటి స్థానంలో కొత్త వంతెనలు పునర్‌ నిర్మించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఈ వంతెనలు కూలిపోతున్న ఘటనలపై ఆ రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్య ప్రసాద్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Also Read: LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్


Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’

ఈ వంతెన ప్రమాదాలల్లో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో ఈ ఇంజినీర్లు విఫలమవ్వడమే కాకుండా.. ఇతరత్ర కారణాలు సైతం ఉన్నాయన్నారు. అలాగే ఈ వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయన్నారు.

Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!

ఇక గ్రామీణ పనుల విభాగం కార్యదర్శి దీపక్ సింగ్ మాట్లాడుతూ.. జూన్ 18న అరారియా జిల్లాలోని బాక్రా నదిపై నిర్మించిన వంతెన దెబ్బతిన్నట్లు తమకు నివేదిక అందిందన్నారు. ఈ వంతెనలు కూలిపోయిన ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరుపుతున్నాయని వివరించారు. మరోవైపు బిహార్‌లోని మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో వరుసగా వంతెనలు కూలిపోయాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 05:47 PM