Home » JDU
బిహార్లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్తో భేటీ కావడమే ఇందుకు కారణం..!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుల గణన(Caste Census) జరపాలని డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ.. అధికార ఎన్డీయేలో ఈ అంశం కుంపట్లు రాజేస్తోంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.
ప్రత్యేక హోదా కోసం బిహార్ ప్రభుత్వ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.
కావడి యాత్ర ర్గంలోని హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానులు, సిబ్బంది పేర్లు పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు 'మధ్యంతర స్టే' ఇచ్చింది. విపక్షాలతో పాటు ఎన్డీయే కీలక భాగస్వామి జనతాదళ్ యూనైటెడ్ సైతం ఈ తీర్పును స్వాగతించింది.
కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
బిహార్లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.