Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:19 AM
కేరళలోని రైల్వే ట్రాక్‌పై విషాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొని నలుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ పూజ నదిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ నలుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరువనంతపురం, నవంబర్ 03: రైల్వే ట్రాక్‌పై విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై చెత్తను శుభ్రం చేస్తున్న క్రమంలో నలుగురు కార్మికులను రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించారు. ఈ సంఘటన కేరళలో పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం షోరనూర్ సమీపంలో భరత్‌పూజ నది ప్రవహిస్తుంది. ఆ నదిపై ఉన్న బ్రిడ్జి రైల్వే ట్రాక్‌ను ఈ కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం వస్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు వీరిని ఢీకొట్టింది.
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
అయితే రైలు వస్తున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను అధికారులు అప్రమత్తం చేయలేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రైలు సమీపంలోని వచ్చే వరకు ఆయా కార్మికులు సైతం గమనించ లేదని.. తీరా వారు గమనించే సరికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందనే వాదన సైతం వినిపిస్తుంది. ఇక ఈ దుర్ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో ముగ్గురు కార్మికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం పాలక్కాడ్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: తోటకూర తినడం వల్ల ఇన్ని లాభాలా..?
అయితే రైలు వచ్చే క్రమంలో రైల్వే బ్రిడ్జ్‌పై నుంచి మరో కార్మికుడు భరతపూజ నదిలో దూకి ఉండవచ్చని రైల్వే పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారన్నారు. మృతుల స్వస్థలం తమిళనాడు అని పోలీసులు వివరించారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..
For National News And Telugu News...