Share News

karnataka: మాండ్యలో మత ఘర్షణలు: 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:31 AM

నవరాత్రి ఉత్సవాల వేళ వినాయకుడి ఊరేగింపు సందర్బంగా మాండ్య జిల్లాలోని నాగమంగళ పట్టణంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

karnataka: మాండ్యలో మత ఘర్షణలు: 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు, సెప్టెంబర్ 12: నవరాత్రి ఉత్సవాల వేళ వినాయకుడి ఊరేగింపు సందర్బంగా మాండ్య జిల్లాలోని నాగమంగళ పట్టణంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. బద్రికొప్పులు గ్రామానికి చెందిన పలువురు వినాయకుడిని నిమజ్జనం కోసం ఊరేగింపు తీసుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో నాగమంగళ పట్టణంలోని మసీద్ వద్దకు వినాయకుడి ఊరేగింపు చేరుకుంది.

Also Read: RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు


ఈ ఊరేగింపుపై పలువురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటే చేసుకుంది. దీంతో ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ వినాయకుడి విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ ఎదుట పెట్టి ఆందోళనకు దిగింది. అందులోభాగంగా 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ వాళ్లు ఏ తప్పు చేయలేదన్నారు.


కారణం లేకుండా వారిని అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా వారి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై వారిని ప్రశ్నించేందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వారికి ఎటువంటి సంబంధం లేకుంటే విచారణ అనంతరం వదిలేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా.. ముందుస్తు చర్యల్లో భాగంగా స్థానికంగా పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 12 , 2024 | 11:33 AM