Share News

Cyber Crime Operations: శ్రీలంకలో 60 మంది భారత జాతీయులు అరెస్ట్

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:43 PM

శ్రీలంకలో అన్‌లైన్‌‌లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 60 మంది భారత జాతీయులను ఆ దేశ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులోని మాడివేల, బట్రాముల్లాతోపాటు పశ్చిమ తీర పట్టణం నెగొంబోలో దాడులు చేసి వీరిని సీఐడీ అదుపులోకి తీసుకుందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Cyber Crime Operations: శ్రీలంకలో 60 మంది భారత జాతీయులు అరెస్ట్
At least 60 Indians part of a group engaged in online scams have been arrested in Sri Lanka

కొలంబో, జూన్ 28: శ్రీలంకలో అన్‌లైన్‌‌లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 60 మంది భారత జాతీయులను ఆ దేశ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులోని మాడివేల, బట్రాముల్లాతోపాటు పశ్చిమ తీర పట్టణం నెగొంబోలో దాడులు చేసి వీరిని సీఐడీ అదుపులోకి తీసుకుందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. 135 సెల్ ఫోన్లతోపాటు 57 ల్యాప్ టాప్‌లను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా నగదు ఇస్తామని చెప్పి.. వీరంతా ఓ పథకం ప్రకారం ప్రజలను ముగ్గులోకి దింపి వారి నుంచి నగదు కాజేస్తున్నారన్నారు.

Political Tragedy: అయ్య బాబోయ్.. అచ్చుగుద్దినట్లుగా సేమ్ టు సేమ్..


బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అయితే నెగొంబోలో నిర్వహించిన దాడుల్లో కీలక అధారాలు లభించాయన్నారు. ఆ క్రమంలో తొలుత 13 మంది అనుమానితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 57 ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం మరో 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి చేతిలో మోసపోయిన వారిలో విదేశీయులు సైతం ఉన్నారని చెప్పారు. దీంతో బాధితుల జాబితాలో స్థానికులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు వివరించారు.

For AP News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 08:44 PM