Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాప దినాలు..
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:05 AM
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది.. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు.. మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు.. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు.
న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి (Ex PM) డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr. Manmohan Singh) గురువారం మరణించారు (Dead). ఆయన మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం (Central Govt.) ఏడు రోజులపాటు (7 Days) సంతాప (Mourning) దినాలు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలపనుంది. ఆయన అంతిమ సంస్కారాలు అన్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది.. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు.. మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు.. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయన్ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని... రాత్రి 9:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. మన్మోహన్‌సింగ్‌కు భార్య గురుచరణ్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, అమృత్, దమన్ ఉన్నారు.
మన్మోహన్‌ను ఆస్పత్రిలో చేర్పించారన్నవార్త తెలిసిన వెంటనే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక.. కర్ణాటకలోని బెలగావీలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.. మన్మోహన్ మరణవార్త తెలియగానే ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన గౌరవార్థం.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే ఏడు రోజులపాటు నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2025 జనవరి 3న పార్టీ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. అప్పటిదాకా పార్టీ జెండాను అవనతం చేస్తామని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాగా.. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని గురువారం రాత్రే ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కాగా.. ఆయన గౌరవార్థం కేంద్రం ఏడురోజులు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News