Share News

ఆ రోజు తాగే కారు నడిపా..!

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:32 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుణే కారు ప్రమాదం’ కేసులో నిందితుడైన 17 ఏళ్ల బాలుడు.. ప్రమాదం జరిగిన రోజున అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపినట్లు అంగీకరించాడు. ‘అవును.. ఆ రోజు అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపాను.

ఆ రోజు తాగే కారు నడిపా..!

  • ‘పుణే ప్రమాదం’ కేసు నిందితుడి అంగీకారం

  • 100 మంది పోలీసులతో కేసు దర్యాప్తు

పుణే, జూన్‌ 2: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుణే కారు ప్రమాదం’ కేసులో నిందితుడైన 17 ఏళ్ల బాలుడు.. ప్రమాదం జరిగిన రోజున అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపినట్లు అంగీకరించాడు.

‘అవును.. ఆ రోజు అధిక మోతాదులో మద్యం తాగే కారును నడిపాను. ఆపై పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు’ అని ఆదివారం పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు రక్త నమూనాలు తారుమారు చేసినందుకు నిందితుడి తల్లిదండ్రులైన విశాల్‌ అగర్వాల్‌, శివానీ అగర్వాల్‌లకు ఈనెల 5 వరకు పుణే కోర్టు పోలీసు కస్టడీ విధించింది.

కేసులో డ్రైవర్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన బాలుడి తాతను.. బాలుడికి మద్యం సరఫరా చేసిన 2 పబ్‌ల యజమానులు, అక్కడి సిబ్బందితో పాటు రక్తనమూనాలు మార్చేందుకు సహకరించిన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగినిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇటు, ఈ కేసును వివిధ కోణాల్లో పరిశీలించేందుకు 100 మంది పోలీసులతో కూడిన డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తును వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ, డాక్యుమెంటేషన్‌, క్షేత్రస్థాయి కార్యకలాపాల కోసం బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 08:26 AM