Kolkata: ఆధార్ కార్డుల తొలగింపుపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్న దీదీ.. ఇంకా ఏమన్నారంటే
ABN , Publish Date - Feb 19 , 2024 | 05:11 PM
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పర విమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తాజాగా సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోల్‌కతాలోని సచివాలయంలో ఆమె సోమవారం మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆధార్ కార్డులను బీజేపీ సర్కార్ తొలగిస్తోందని ఆమె ఆరోపించారు.
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పర విమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తాజాగా సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
కోల్‌కతాలోని సచివాలయంలో ఆమె సోమవారం మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆధార్ కార్డులను బీజేపీ సర్కార్ తొలగిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ (NRC)ని తీసుకురావడంలో భాగంగా ముందుగానే ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
"లోక్‌సభ ఎన్నికలకు(Parliament Elections - 2024) ముందే ఇన్ని ఆధార్ కార్డులు ఎందుకు డీయాక్టివేట్ చేస్తున్నారు? మతువా కమ్యూనిటీకి చెందిన చాలా మంది వ్యక్తుల ఆధార్ కార్డులు ఇప్పటికే డీయాక్టివేట్ అయ్యాయి. బాధితుల్లో ఎస్టీలు, మైనార్టీలు కూడా ఉన్నారు" అని దీదీ అన్నారు. ఆమె వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి