Delhi: ఆప్ కా రాం రాజ్య వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఆప్.. అసలేంటిది
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:47 PM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారని చెబుతూ ఆమ్ ఆద్మీ(AAP) పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. శ్రీ రామ నవమి సందర్భంగా తమ పాలన రామరాజ్యంతో సమానమే భావనను కలిగించడానికి ఆప్ బుధవారం ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది.
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారని చెబుతూ ఆమ్ ఆద్మీ(AAP) పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది.
శ్రీ రామ నవమి సందర్భంగా తమ పాలన రామరాజ్యంతో సమానమే భావనను కలిగించడానికి ఆప్ బుధవారం ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సమక్షంలో "ఆప్ కా రాం రాజ్య" వెబ్‌సైట్‌ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. "రామరాజ్యం స్ఫూర్తితో మా ప్రభుత్వం పని చేస్తోంది. రామరాజ్యం సాకారానికి గడిచిన 10 ఏళ్లలో సీఎం కేజ్రీవాల్ అద్భుతమైన పనులు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా పాఠశాలలు బాగు చేయడం, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేయండి, ఉచిత మంచినీరు, విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పనులను చేశాం.
Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు
రామనవమి రోజు కేజ్రీవాల్ తనకెంతో ఇష్టమైన ప్రజల మధ్య లేకపోవడం ఇదే తొలిసారి. తప్పుడు ఆరోపణలతో బీజేపీ ఆయన్ని జైలుకు పంపింది. చేయని తప్పునకు కేజ్రీవాల్ శిక్ష అనుభవిస్తున్నారు" అని సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి