AAP: స్వాతి మలివాల్‌పై అనుచిత ప్రవర్తన.. ఆప్ స్పందన ఏమిటంటే..?
ABN , Publish Date - May 14 , 2024 | 05:41 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారంనాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ (Swamti Maliwal) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు స్పందించింది. సీఎం వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారంనాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ (Swamti Maliwal) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు స్పందించింది. సీఎం వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ పరిగణనలోకి తీసుకున్నారని, ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటారని మంగళవారంనాడు తెలిపింది.
కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సీఎం వ్యక్తిగత సహాయకుడు వైభవ్ కుమార్ తనపై దాడి జరిపాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఫిర్యాదు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీనిపై మూడు రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించగా, ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ ఘటనపై వెంటనే సీఎం నివాసం నుంచి కానీ, ఆప్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ మంగళవారంనాడు ఆ పార్టీ వివరణ ఇచ్చింది.
Bansuri Swaraj: స్వాతిపై దాడి.. కేజ్రీవాల్ స్పందించక పోవడం సిగ్గుచేటు
అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన నివాసంలోని డ్రాయింగ్ రూమ్ వద్ద స్వాతి మలివాల్ వేచి ఉన్నప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుందని, సీఎం సహాయకుడు విప్లవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించినట్టు గుర్తించామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని, తగిన చర్యలు తీసుకోనున్నారని వివరించారు.
Read National News And Telugu News