Share News

Jammu and Kashmir: ఆప్ మద్దతు ఆ పార్టీకే.. ఎల్జీకి లేఖ సమర్పణ

ABN , Publish Date - Oct 11 , 2024 | 02:17 PM

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుతుంది. సొంతంగా 42 సీట్లలో ఎన్‌సీ గెలుపొందగా, భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి.

Jammu and Kashmir: ఆప్ మద్దతు ఆ పార్టీకే.. ఎల్జీకి లేఖ సమర్పణ

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ (NC)కు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సారథ్యంలోని ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నట్టు పేర్కొంటూ లెఫ్టెనెంట్ గవర్నర్ కార్యాలయానికి ఆ పార్టీ ఒక లేఖను అందించింది. ఇటీవల వెలువడిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దోడా నియోజకవర్గం నుంచి 'ఆప్' అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ గెలుపొందారు.

PM Modi: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..


నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుతుంది. సొంతంగా 42 సీట్లలో ఎన్‌సీ గెలుపొందగా, భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి దక్కించుకుంది. దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఏడుగురిలో నలుగురు గురువారంనాడు ఎన్‌సీకి మద్దతు ప్రకటించారు. తాజాగా ఆప్ సైతం ఎన్‌సీకి మద్దతు తెలిపింది. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేటివ్ గ్రూప్ నేతగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికైనట్టు ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరేందుకు ఎన్‌సీ సన్నద్ధమవుతోంది.


For National News And Telugu News

ఇది కూడా చదవండి...

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

Updated Date - Oct 11 , 2024 | 02:22 PM