Share News

Delhi Mayor: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఆప్

ABN , Publish Date - Nov 14 , 2024 | 08:44 PM

ఢిల్లీ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కించి విజయం సాధించారు.

Delhi Mayor: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఆప్

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మరోసారి కైవసం చేసుకుంది. గురువారం మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేశ్ కించికి 133 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 3 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి మహేశ్ విజయం సాధించారు.

Also Read: ఊపందుకున్న ప్రచారం.. ఈసీ సోదాలు


కరోల్ బాగ్‌లోని దేవ్ నగర్ కౌన్సిలర్‌గా మహేశ్ కించి గెలుపొందారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చాలా కాలంగా బీజేపీ ఆశిస్తుంది. కానీ ఈ సారి కూడా ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మచ్చటగా మూడోసారి షెడ్యూల్ తెగలకు చెందిన మహేశ్ కించి చేపట్టనుండడం గమనార్హం.

Also Read: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన


మేయర్ అధ్యక్ష ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయంలో ఈ రోజు జరిగాయి. ఆప్ సీనియర్ నేతలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాతోపాటు న్యూఢిల్లీ పరధిలోని మొత్తం ఏడుగురు బీజేపీ ఎంపీలు సమక్షంలోనే ఈ ఎన్నికలు జరిగాయి. మరోవైపు మేయర్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ సబిలా బేగం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను ఆప్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు ప్రకటించి హస్తం పార్టీ నేతలకు ఆమె షాక్ ఇచ్చారు.

Also Read: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..


అసలు అయితే ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నిక ఆలస్యమైంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా అధికార పీఠాన్ని తమదే కావలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ఢిల్లీలో ఆ పార్టీ పాలనకు చరమ గీతం పాడాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తుంది.

Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు


ఇంకో వైపు మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. అంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్

Also Read: ఢిల్లీకి సీఎం చంద్రబాబు


అయితే సీఎం కేజ్రీవాల్‌కు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీలోని సీనియర్ నేత అతిషికి కట్టబెట్టారు. తన నిజాయతీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపించుకుంటానని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

For National News And Telugu News

Updated Date - Nov 14 , 2024 | 08:45 PM