Share News

AAP: మరో రాష్ట్రాన్ని టార్గెట్ చేసిన కేజ్రీవాల్.. అక్కడ అన్నీ సీట్లలో పోటీ

ABN , Publish Date - Jan 29 , 2024 | 10:14 AM

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్టీ విస్తరణలో భాగంగా తన తదుపరి లక్ష్యాన్ని మరో రాష్ట్రంపైకి మళ్లించారు. ఆప్ తరువాతి టార్గెట్ హరియాణే(Haryana) అని స్పష్టం చేశారు.

AAP: మరో రాష్ట్రాన్ని టార్గెట్ చేసిన కేజ్రీవాల్.. అక్కడ అన్నీ సీట్లలో పోటీ

హరియాణా: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్టీ విస్తరణలో భాగంగా తన తదుపరి లక్ష్యాన్ని మరో రాష్ట్రంపైకి మళ్లించారు. ఆప్ తరువాతి టార్గెట్ హరియాణే(Haryana) అని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హరియాణాలోని జింద్‌లో మాట్లాడుతూ.. ‘‘ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసిస్తున్నారు. పంజాబ్‌ను, ఢిల్లీలో మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని హరియాణా ప్రజలు చూస్తున్నారు. రామ రాజ్యం స్ఫూర్తితో ఢిల్లీ, పంజాబ్‌లలో మా పాలన సాగుతోంది. హరియాణా ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ప్రజలు కోరుకున్న మార్పును తీసుకొచ్చాం. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అభివృద్ధిపథంలో నడుస్తున్నాయి.

హరియాణాలో కూడా మార్పు రావాల్సిన సమయం వచ్చింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. ఇక్కడున్న పార్టీలు జేబులు నింపుకోవడానికే పని చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోతున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో మా పార్టీ సొంతంగా పోటీ చేస్తుంది. త్వరలో ఇక్కడా ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్ల పంపకాలకనుగుణంగానే పోటీ చేస్తాం. నన్ను బెదిరించడానికి బీజేపీ.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అరెస్టు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. వాటికి నేను భయపడను" అని కేజ్రీవాల్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2024 | 10:17 AM