Share News

Air India Express: సిక్ లీవ్ వివాదం.. 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా

ABN , Publish Date - May 09 , 2024 | 11:13 AM

సిక్ లీవ్ పెట్టడంతో 19వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా(Air India Express) తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.

Air India Express: సిక్ లీవ్ వివాదం.. 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా

ఢిల్లీ: సిక్ లీవ్ పెట్టడంతో 19వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా(Air India Express) తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది. ఘటనకు కారకులైన 25 మంది సిబ్బందిపై వేటు వేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి నివేదిక కోరింది.

సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరింది. అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ప్రత్యామ్నయం చూపించాలని ఆదేశించింది.


అసలేమైందంటే..

ఎయిర్ ఇండియా(Air India) ఎక్స్‌ప్రెస్ సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని.. 80కిపైగా విమానాలను రద్దు చేశామని తెలిపింది.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం కానీ, విమానాలు రీ షెడ్యూల్ చేస్తామని వివరించింది. మే 8వ తేదీన ప్రయాణాలు షెడ్యూల్ చేసుకున్న ప్రయాణికులు తాము ఇంటి నుంచి బయల్దేరే ముందే తమ విమానం క్యాన్సల్‌ అయిందో? లేదో? నిర్ధారించుకోవాలని సూచించింది.


NIA: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

సిబ్బంది, ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి..

సిబ్బంది సిక్ లీవ్ పెట్టారనే కారణంతో విమానాలు రద్దు చేయడంపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్.. సంస్థపై విమర్శలు చేసింది. సంస్థ నిర్వహణ బాలేదని, సిబ్బంది మధ్య వివక్ష సాధారణమైపోయిందని ఆరోపించింది. విస్తారా ఎయిర్ లైన్స్ విలీనంపై కూడా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. సంస్థ తీరు వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని చెబుతున్నారు.

విమానాల రద్దుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. సిబ్బంది సెలవులు పెట్టడం వల్ల విమానాలను రద్దు చేయడం, ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు తరచూ ఇలాంటి సమస్యలే వస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

Read Latest News and National News click here..

Updated Date - May 09 , 2024 | 11:13 AM