BIG Breaking: తిరుచ్చిలో టెన్షన్ టెన్షన్.. 140 మంది ప్రయాణికులతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
ABN , Publish Date - Oct 11 , 2024 | 08:20 PM
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది.
చెన్నై: తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ లోపం ఏర్పడింది. అనంతరం గంటన్నరకుపైగా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించాడు.
సేఫ్ ల్యాండింగ్ కోసం సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు. విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. అందులోని ఇంధనాన్ని ఖాళీ చేశారు. మిగతా విమానాలను ఇతర ఎయిర్‌పోర్ట్‌లవైపు మళ్లించారు.
ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ వద్ద 20 అంబులెన్స్‌లు..20 ఫైరింజన్‌లు సహా మెడికల్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచారు. భారీగా పారామెడికల్ సిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో 140 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News