Share News

Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. చివర్లో అధికారుల ట్విస్ట్

ABN , Publish Date - Jun 25 , 2024 | 06:28 PM

ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు రావడం మరీ ఎక్కువైపోయాయి. కొందరు దుండగులు ఈ-మెయిల్స్ ద్వారా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ..

Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. చివర్లో అధికారుల ట్విస్ట్
Air India Flight

ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) రావడం మరీ ఎక్కువైపోయాయి. కొందరు దుండగులు ఈ-మెయిల్స్ ద్వారా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ.. తమ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా ఎయిర్ ఇండియాకి (Air India) కూడా ఇలాంటి బెదిరింపులొచ్చాయి. తీరా చూస్తే.. అదొక ఫేక్ కాల్ అని తేలింది. దీంతో అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని, వెంటనే విచారణ జరిపి, ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 అనే విమానం కొచ్చిన్ నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ చేయబడింది. అయితే.. అది టేకాఫ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ఆ విమానంలో బాంబు ఉందని చెప్పి, అవతలి వ్యక్తి వెంటనే కట్ చేశాడు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందుగా ఓ సమావేశం నిర్వహించారు. అనంతరం భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపి.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇన్‌లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్‌లు సైతం పరిశీలించాయి.


చివరికి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో.. అదొక ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. అనంతరం చెక్-ఇన్ ప్రక్రియను 10:30 గంటలకు పూర్తి చేసుకొని.. ఆ విమానం 11:50 కు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. మరోవైపు.. ఫేక్ కాల్ ఎవరు చేశారనే దానిపై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాళ్లకు మలప్పురం జిల్లాకు చెందిన సుహేబ్ (29) అనే వ్యక్తి ఈ పేక్ కాల్ చేశాడని తెలిసింది. అతనిని అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫేక్ కాల్ వెనుక గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 06:28 PM