Share News

Illegal mining case: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:03 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌కు అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్‌పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది.

Illegal mining case: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

లక్నో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav)కు అక్రమ మైనింగ్ కేసు (Illegal mining case)లో సీబీఐ (CBI) సమన్లు పంపింది. 160 సీఆర్‌పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ కేసులో సాక్షిగా ఫిబ్రవరి 29న తమ ముందు హాజరుకావాలని అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ తమ సమన్లలో కోరింది.


హమీర్‌పూర్‌‌(యూపీ)లో 2012-2016 మధ్య మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్‌కు ప్రభుత్వాధికారులు అనుమతించారని, నేరపూరిత కుట్ర ఇందులో ఉందని సీబీఐ ఆరోపణగా ఉంది. ఈ-టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక మైనింగ్‌కు ఫ్రెష్ లీజ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని, ఇందుకు ప్రతిగా అధికారులు, మరికొందరు లబ్ది పొందారని ఆరోపిస్తోంది. ఈ కేసులో 2019 జనవరి 5న యూపీలోని హమీర్‌పూర్, జలాన్, నొయిడా, కాన్పూర్, లక్నోతో పాటు ఢిల్లీలోనూ మొత్తం 12 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 04:03 PM